

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం హైదరాబాద్లో NHAI ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొనసాగుతున్న మరియు చేపట్టబోయే పలు జాతీయ రహదారి ప్రాజెక్టులపై ఈ సందర్భంగా చర్చించారు. ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (NH-65) విస్తరణ పనులపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న ఈ రహదారిని త్వరగా ఎనిమిది లేన్లుగా విస్తరించాలని కోరారు.
హైదరాబాద్–విజయవాడ రహదారిలో ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు నాగపూర్ తరహాలో 7.1 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖకు పంపిన విషయాన్ని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని NHAI అధికారులను కోరారు. టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని అధికారులు మంత్రికి తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!