

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్, దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న బ్రేక్‌ఫాస్ట్ పథకానికి సీఎస్ఆర్ నిధులను అందజేశారు. అరబిందో ఫార్మా రూ.10 కోట్లు, దివీస్ లేబొరేటరీస్ రూ.12.18 కోట్లు విరాళంగా అందించగా, హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తోంది.
ఈ సందర్భంగా CSR నిధులు అందించిన సంస్థలను ముఖ్యమంత్రి అభినందించారు. సెంట్రలైజ్డ్ కిచెన్‌ల పరిసర ప్రాంతాల రైతుల నుంచి కూరగాయలు, బియ్యం తదితర అవసరమైన వస్తువులను నేరుగా కొనుగోలు చేసే విధానంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. రైతులను సేంద్రీయ వ్యవసాయం, పంట మార్పిడి విధానం వైపు ప్రోత్సహించి, నాణ్యమైన విత్తనాలు అందించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచే చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!