

కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా గోదావరి నదీ తీరాల్లో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు గోదావరి స్నాన ఘాట్లకు చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. నదిలో పుణ్యస్నానాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. కార్తీక మాసంలో సోమవారానికి విశేష ప్రాధాన్యత ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో గోదావరి స్నాన ఘాట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని శివాలయాలు కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచే ఆలయాల వద్ద భక్తులు బారులు తీరి శివుడికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గోదావరి స్నాన ఘాట్లతో పాటు శివాలయాల వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో నదీ తీర ప్రాంతాలు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!