

మానస సరోవర్ యాత్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన 31 మంది యాత్రికులు ప్రతికూల పరిస్థితుల కారణంగా అక్కడే చిక్కుకుపోయినట్లు సమాచారం. మరోవైపు, డీఆర్‌డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి, ఆయన సతీమణి నేపాల్‌లో చిక్కుకుపోయారు. అయితే వారు ప్రస్తుతం సాగా ప్రాంతంలో క్షేమంగా ఉన్నట్లు సమాచారం. వరదల ప్రభావం ఉన్న ప్రాంతాన్ని వారు నిన్న ఉదయం దాటి వెళ్లినట్లు తెలుస్తోంది.
సతీష్ రెడ్డి బృందం ఆ ప్రాంతాన్ని దాటిన కొన్ని గంటలకే భారీ వరదలు సంభవించినట్లు సమాచారం. దీంతో వారు సకాలంలో సురక్షిత ప్రాంతానికి చేరుకోవడం ఊరటనిచ్చింది. ప్రస్తుతం సాగా ప్రాంతంలో ఉన్న సతీష్ రెడ్డి దంపతులు క్షేమంగా ఉన్నారని సమాచారం అందింది. ఇదే సమయంలో మానస సరోవర్ యాత్రలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికుల పరిస్థితిపై ఆందోళన నెలకొనగా, వారికి అవసరమైన సహాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!