

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాతావరణ శాఖ దృష్టిని ఆకర్షిస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD), గ్లోబల్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్ (GFS), యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్స్ (ECMWF) అంచనాల ప్రకారం ఈ వ్యవస్థ పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడే అవకాశం ఉంది. జూలై 5 నాటికి ఇది మరింత తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారే అవకాశముందని సూచిస్తున్నాయి. అయితే ఇది ఏ ప్రాంతం మీదుగా పయనిస్తుంది, ఎంత తీవ్రతతో తీరం దాటుతుంది అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం సుమారు 30 శాతం మాత్రమే ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ, దీని ప్రభావంతో కురిసే వర్షాలు ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సాగుకు ఎంతో ఉపయోగపడనున్నాయి. జూన్‌లో వర్షాభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు జూలై తొలి వారంలో కురిసే వర్షాలు ఊరటనివ్వనున్నాయి. ముఖ్యంగా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాల పెరుగుదలకు ఈ వర్షాలు దోహదం చేసే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!