

విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ప్లీనరీ హాల్‌లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పెవిలియన్, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ప్రదర్శనను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి ఆయన ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శన శాలలను పరిశీలించారు. అరకు కాఫీని రుచి చూశారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన అమరావతి రాజధాని టవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తిరుపతి, విశాఖపట్నం, అమరావతి ఆర్థిక ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు నేతలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, రాజ్యసభ సభ్యుడు భాష్యం ప్రవీణ్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శన ద్వారా రాష్ట్ర పారిశ్రామిక సామర్థ్యం, పెట్టుబడి అవకాశాలు, సాంస్కృతిక ప్రత్యేకతలను సందర్శకులకు వివరించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!