
బిజినెస్

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మరియు బ్రాహ్మణి దంపతులు సోమవారం హైదరాబాద్లోని తమ నివాసంలో వేద పండితుల ఆధ్వర్యంలో ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది.
పూజా కార్యక్రమంలో లోకేష్ దంపతులు సంప్రదాయ పద్ధతిలో పాల్గొని మహాశివునికి అభిషేకాలు నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి, సుభిక్షం నెలకొనాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేద పండితులు నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!