
క్రీడలు

వైఎస్ కుటుంబంలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో కొంతకాలంగా చికిత్స పొందుతున్న వైఎస్ ఆనంద్ రెడ్డి కన్నుమూశారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు రాజకీయ నాయకులు, సన్నిహితులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ ఆనంద్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డికి సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి పెదనాన్న, అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కుటుంబ పెద్దల్లో ఒకరు. ఆయన మరణంతో వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!