
సినిమాలు

జాతీయ విద్యా విధానం (NEP-2020)లో భాగంగా 2026–27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఏడాది కాలపరిమితి గల బీఈడీ కోర్సును పునఃప్రారంభించేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (NCTE) ఆమోదం తెలిపింది. ఈ కొత్త విధానం ఉపాధ్యాయ విద్యలో వేగవంతమైన శిక్షణకు దోహదపడనుంది.
మాస్టర్స్ డిగ్రీ లేదా నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఒక సంవత్సరం బీఈడీ కోర్సుకు అర్హులుగా నిర్ణయించారు. సాధారణంగా మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రస్తుతం కొనసాగుతున్న రెండేళ్ల బీఈడీ కోర్సు యథాతథంగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!