
షోస్

విశాఖ–కిరండూల్ (కేకే) రైల్వే లైన్‌లో కొండచరియలు విరిగిపడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చత్రిపుట్–మల్లిగుర స్టేషన్ల మధ్య ట్రాక్‌పై కొండచరియలు పడటంతో రైళ్ల రాకపోకలను ప్రభావితం చేసింది. రైల్వే సిబ్బంది ట్రాక్‌పై పడిన మట్టిని, రాళ్లను తొలగించే పనులు చేపట్టారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో విశాఖపట్నం–జగదల్‌పూర్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను రేపు, ఎల్లుండి రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైళ్ల రాకపోకలపై తాజా సమాచారం తెలుసుకోవాలని అధికారులు సూచించారు. ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తయిన తర్వాత రైళ్ల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురానున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!