

తెలంగాణకు చెందిన చరణ్ మహాదేవ్ అలియాస్ ఆర్జే చరణ్ అగ్నిపరీక్షలో సత్తా చాటి బిగ్‌బాస్ తెలుగు 10లోకి అడుగుపెట్టాడు. నిజామాబాద్‌లో పుట్టి పెరిగిన చరణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్‌లో రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించాడు. అనంతరం యాంకర్‌గా పలు ఇంటర్వ్యూలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. డ్యాన్స్‌పై ఉన్న ఆసక్తితో పిల్లలకు శిక్షణ ఇస్తూనే.. ఆన్‌లైన్‌లో వీడియో ఎడిటింగ్ కూడా నేర్పిస్తున్నాడు.
రేడియో జాకీ, యాంకర్, డ్యాన్సర్, వీడియో ఎడిటింగ్ వంటి విభిన్న రంగాల్లో తన ప్రతిభను చాటిన చరణ్.. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష పోటీలోనూ ఆకట్టుకున్నాడు. తనదైన శైలిలో ప్రదర్శనలు ఇచ్చి జడ్జిలను మెప్పించడంతో బిగ్‌బాస్ తెలుగు 10లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. కమ్యూనికేషన్ స్కిల్స్, డ్యాన్స్ ప్రతిభతో పాటు విభిన్న రంగాల్లో అనుభవం ఉన్న చరణ్.. బిగ్‌బాస్ హౌస్‌లో ఎలాంటి ఆటతీరు ప్రదర్శిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!