

జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన కమెడియన్ నరేశ్.. బిగ్‌బాస్ తెలుగు 10లో 11వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తన ఆహార్యాన్ని బలంగా మార్చుకుని పంచులు, కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు 600కు పైగా స్కిట్స్‌లో నటించిన నరేశ్.. కేవలం రూ.500 పారితోషికంతో కెరీర్ ప్రారంభించినట్లు తెలిపారు. షోలు, ఈవెంట్లతో క్రమంగా తన కెరీర్‌ను అభివృద్ధి చేసుకున్న ఆయన.. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
నరేశ్‌ది సాధారణ ఆర్థిక పరిస్థితులు ఉన్న కుటుంబం. ఆయన తండ్రి ట్రాలీ ఆటో నడపడంతో పాటు కుటుంబం స్క్రాప్ వ్యాపారం చేసేది. కుటుంబ పరిస్థితుల కారణంగా నరేశ్ తొమ్మిదో తరగతి వరకే చదువుకున్నాడు. అనంతరం ఢీ జూనియర్స్ ఆడిషన్స్‌కు వెళ్లిన సమయంలో పరిచయమైన వ్యక్తి ద్వారా జబర్దస్త్‌లో అవకాశం దక్కింది. అది ఆయన కెరీర్‌కు కీలక మలుపుగా మారింది. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, బుల్లెట్ భాస్కర్, కెవ్వు కార్తీక్ తదితరుల టీమ్స్‌లో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇప్పుడు బిగ్‌బాస్ తెలుగు 10లో అడుగుపెట్టి.. ఈ కొత్త వేదికపై ఎలాంటి ఆటతీరును చూపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!