

ప్రముఖ టెలివిజన్ నిర్మాత, దర్శకుడు బృజేంద్ర పాల్ సింగ్, బీపీ సింగ్‌గా ప్రసిద్ధి చెందిన ఆయన, మంగళవారం ఉదయం 77 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన, దూరదర్శన్‌లో న్యూస్ కెమెరామన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం భారత టెలివిజన్ రంగంలో ప్రముఖ నిర్మాత, దర్శకుడిగా గుర్తింపు పొందారు.
1998లో బీపీ సింగ్ రూపొందించిన ‘సీఐడీ’ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ భారత టెలివిజన్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. సుదీర్ఘకాలం ప్రసారమైన ఈ సిరీస్ ప్రేక్షకులకు చిరస్మరణీయమైన పాత్రలను పరిచయం చేసింది. ఆయన మరణవార్తను చిత్ర నిర్మాత అశోక్ పండిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ, వినోద రంగానికి బీపీ సింగ్ అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఐఎఫ్‌టిడీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనతో సన్నిహితంగా పనిచేయడం తన అదృష్టమని పేర్కొన్నారు. ‘సీఐడీ’లో దయా పాత్రతో గుర్తింపు పొందిన నటుడు దయానంద్ శెట్టి కూడా బీపీ సింగ్‌కు నివాళులర్పించారు. కంటెంట్ రూపకల్పన పట్ల ఆయనకు అపారమైన అంకితభావం ఉండేదని, గొప్ప కెమెరామన్‌గా ఆయనకు పేరుందని తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బీపీ సింగ్ మంగళవారం ఉదయం నిద్రలోనే కన్నుమూశారని శెట్టి వెల్లడించారు. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అశోక్ పండిట్ తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!