

తిరుమలలో ఘనంగా జరిగిన గరుడోత్సవంలో నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు. నందమూరి మోహన కృష్ణ, నందమూరి సీమ, నందమూరి రూపతో పాటు నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గరుడ వాహనానికి హారతి ఇచ్చిన అనంతరం అక్కడి స్థానిక కళాకారులతో కలిసి సంప్రదాయ కోలాటం ఆడారు. వారి పాల్గొనడంతో ఉత్సవ ప్రాంగణంలో సందడి నెలకొంది. స్థానికులతో మమేకమవుతూ సంప్రదాయ కళలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఉత్సవం అనంతరం నందమూరి కుటుంబ సభ్యులు స్థానిక హోటల్లో ఎన్టీఆర్ రాజు, శ్రీధర్ వర్మతో పాటు సాధారణ ప్రజలతో కలిసి టిఫిన్ చేశారు. గతంలో అన్నదాన ట్రస్ట్‌కు విరాళాలు అందించిన విషయాన్ని నందమూరి మోహన కృష్ణ గుర్తుచేసుకున్నారు. తిరుమలతో తమకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. స్థానికులు, కళాకారులతో కలిసి ఈ మహోత్సవంలో భాగస్వాములు కావడం ఎంతో సంతృప్తినిచ్చిందని నందమూరి రూప పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!