
షోస్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించనున్నారు. దసరా పండుగ సందర్భంగా స్థానిక ప్రజలు, ముఖ్య నాయకులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఆయన అందుబాటులో ఉండనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు మైసూరు నుంచి హైదరాబాద్ చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి, బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా రవీంద్ర భారతికి వెళ్లనున్నారు.
రవీంద్ర భారతిలో నిర్వహించనున్న శ్రీ పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణానికి చేరుకుంటారు. అక్కడ స్థానికులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులకు దసరా శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు కొడంగల్ నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!