
క్రీడలు

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సంస్థాగత బలోపేతంపై అధిష్ఠానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్షా నవంబర్లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్లో తెలంగాణలో పర్యటించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించడం, నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం లక్ష్యంగా ఈ పర్యటనలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
నవంబర్లో తెలంగాణకు రానున్న అమిత్షా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించిన బూత్ కమిటీ సమ్మేళనంలో పాల్గొననున్నారు. పార్టీ క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, రానున్న రాజకీయ పరిణామాలకు కార్యకర్తలను సన్నద్ధం చేయడంపై ఈ సమావేశంలో దృష్టి సారించే అవకాశం ఉంది. డిసెంబర్లో మోదీ పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!