
షోస్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ ఇంకా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందలేదని ఆయన వెల్లడించారు. ఉత్తర్వులు అందిన వెంటనే సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు, 19 మున్సిపాలిటీలను మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని పునేఠా తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో న్యాయస్థానాల ఆదేశాలను పాటిస్తూ, అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!