

బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ యువతులకు కీలక సూచనలు చేశారు. ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో వెలుగుచూసిన వరకట్న వేధింపులు, వివాహిత యువతుల అనుమానాస్పద మరణాలపై స్పందిస్తూ ఆమె ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్టు పెట్టారు. జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి కాపాడతారని ఎదురు చూడొద్దని సూచించారు. మహిళలకు వారి వృత్తి, స్వీయ వ్యక్తిత్వమే అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
వివాహిత మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేసిన కంగనా, తమ జీవితాన్ని తమే నిర్మించుకోవాలని యువతులకు పిలుపునిచ్చారు. సమాజ ఒత్తిడికి లొంగకుండా స్వతంత్రంగా ఎదగాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు భోపాల్లో నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి, అదనపు కట్న వేధింపుల ఆరోపణలతో చోటుచేసుకున్న మరికొన్ని యువతుల మరణాల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!