
ఓటీటీ

కేటీఆర్ ఎంసెట్ 2026లో 156.63 మార్కులతో రాష్ట్ర స్థాయి తొలి ర్యాంక్ సాధించిన మల్లాడి రుషిని అభినందించారు. చిలుకనగర్ డివిజన్‌కు చెందిన కొండల్ రెడ్డి కుమార్తె రుషిని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నానక్‌రామ్‌గూడలోని కేటీఆర్ నివాసానికి తీసుకెళ్లి సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆమెకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు.
సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి రాష్ట్రంలో తొలి ర్యాంక్ సాధించడం గొప్ప విషయమని కేటీఆర్ ప్రశంసించారు. మల్లాడి రుషి విజయం ఉప్పల్ నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొన్నారు. క్రమశిక్షణ, సమయపాలన, నిరంతర శ్రమతో విద్యార్థులు ఉన్నత విజయాలు సాధించవచ్చని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!