
జనరల్

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ. మాధవి దేవి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త గురించి అందరికీ తెలుసని, అయినప్పటికీ తనపై ప్రభావం చూపుతున్నారంటూ, ఆశచూపుతున్నారంటూ వస్తున్న ఆరోపణలు బాధ కలిగిస్తున్నాయని తెలిపారు.
ఈ అంశంపై కోర్టులో కూడా చర్చ జరిగింది. సీనియర్ న్యాయవాది స్పందిస్తూ ఇలాంటి ప్రచారం గతంలో కూడా జరిగినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ప్రచారం చేయడం సరికాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కేసును మెరిట్స్ ఆధారంగా విచారిస్తానని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!