

ఉమ్మడి ఖమ్మం–నల్గొండ–వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జనసేన పార్టీ డాక్టర్ గడల శ్రీనివాసరావును అభ్యర్థిగా ముందస్తుగా ప్రకటించింది. ఆయన జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు, అధికార ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం జిల్లా సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో వైద్య ఆరోగ్యశాఖలో ఉన్నతస్థాయిలో సేవలందించిన ఆయన తెలంగాణలో వైద్య ఆరోగ్య రంగానికి విశేష సేవలు అందించారు.
పట్టభద్రులు, ఉద్యోగులు, యువత, విద్యావంతులు, మేధావుల సమస్యలను శాసన మండలి వేదికగా బలంగా వినిపించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని డాక్టర్ గడల శ్రీనివాసరావు తెలిపారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, జాతీయ కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మూడు జిల్లాల పట్టభద్రుల మద్దతుతో ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!