
క్రీడలు

మోడల్, నటి ట్విషా శర్మ మరణ కేసుపై ప్రముఖ ఆంగ్ల రచయిత్రి శోభా డే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా నిందితుడు పది రోజులు గడిచినా దొరకకపోవడం అనుమానాస్పదమని ఆమె పేర్కొన్నారు. ఈ కేసు వెనుక ఎవరో ప్రభావవంతులు ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యలు మే 12న భోపాల్లో అనుమానాస్పద స్థితిలో ట్విషా శర్మ మృతి చెందిన ఘటన నేపథ్యంలో వచ్చాయి. ఈ కేసులో ట్విషా భర్త సమర్థ్ సింగ్ను జబల్పూర్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే అతని న్యాయవాది మాత్రం ఇది అరెస్ట్ కాదని, కోర్టుకు స్వచ్ఛందంగా వస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ట్విషా తల్లిదండ్రులు వరకట్న వేధింపుల కారణంగానే తమ కుమార్తెను హత్య చేశారని ఆరోపిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!