17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక యాత్ర.. కాచిగూడ నుంచి ‘అరుణాచలం మోక్ష యాత్ర’ ప్యాకేజీ

Writer: Chandrika 02:40 PM, 16 నవంబర్, 2026
భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక యాత్ర.. కాచిగూడ నుంచి ‘అరుణాచలం మోక్ష యాత్ర’ ప్యాకేజీ

తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ‘అరుణాచలం మోక్ష యాత్ర’ పేరుతో ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు సాగే ఈ యాత్రలో తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయం, కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయంతో పాటు పుదుచ్చేరిలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరే కాచిగూడ–పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌ (17653) ద్వారా యాత్ర ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఉదయం 11:05 గంటలకు పుదుచ్చేరి చేరుకున్న తర్వాత అరోవిల్‌, అరబిందో ఆశ్రమం, ప్యారడైజ్‌ బీచ్‌లను సందర్శిస్తారు. అనంతరం తిరువణ్ణామలై చేరుకొని అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంటారు. అక్కడ మోక్షమార్గం సదుపాయాన్ని కూడా వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత కాంచీపురంలోని ఆలయాలను దర్శించుకొని, అరక్కోణం నుంచి సాయంత్రం 6:05 గంటలకు 17651 నంబరు రైలులో తిరుగు ప్రయాణం ప్రారంభిస్తారు. మరుసటి రోజు ఉదయం 7:50 గంటలకు కాచిగూడ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 18 వరకు ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రయాణికుల సంఖ్య, గది షేరింగ్‌ విధానం, రైలు తరగతిని బట్టి ప్యాకేజీ ధరలు మారుతాయి. ఒకరి నుంచి ముగ్గురు బుక్‌ చేసుకుంటే కంఫర్ట్‌ (3 ఏసీ)లో ట్విన్‌ షేరింగ్‌కు ఒక్కొక్కరికి రూ.16,900, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.13,210 చెల్లించాలి. స్టాండర్డ్‌ (స్లీపర్‌)లో ఈ ధరలు వరుసగా రూ.14,820, రూ.11,125గా ఉన్నాయి. నలుగురు నుంచి ఆరుగురు కలిసి బుక్‌ చేసుకుంటే కంఫర్ట్‌లో డబుల్‌ షేరింగ్‌కు రూ.13,900, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.11,920; స్టాండర్డ్‌లో వరుసగా రూ.11,820, రూ.9,840 చెల్లించాలి. ప్యాకేజీలో రైలు ప్రయాణం, స్థానికంగా తిరిగేందుకు ఏసీ వాహనం, రెండు రోజుల వసతి, ఉదయం అల్పాహారం, ప్రయాణ బీమా సదుపాయాలు ఉంటాయి. పర్యాటక ప్రాంతాల్లో ప్రవేశ రుసుములు మాత్రం ప్రయాణికులే చెల్లించాలి. రద్దు ఛార్జీలు ఐఆర్‌సీటీసీ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి. పూర్తి వివరాలు, హోటల్‌ సమాచారం, బుకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు

ట్యాగ్లు
ఐఆర్‌సీటీసీ టూర్‌ ప్యాకేజీఅరుణాచలం మోక్ష యాత్రఅరుణాచలేశ్వర ఆలయంకాచిగూడ రైల్వే స్టేషన్‌తమిళనాడు పర్యాటకంపుదుచ్చేరి పర్యాటకంకాంచీపురం ఆలయాలుఆధ్యాత్మిక యాత్రరైలు ప్రయాణంపర్యాటక ప్యాకేజీలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..
జనరల్

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..
సినిమాలు

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..
జనరల్

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..
జనరల్

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్
టెక్నాలజీ

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ
జనరల్

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్
జనరల్

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి
రాజకీయాలు

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు
జనరల్

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు
జనరల్

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు

రామోజీరావు దేశ సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనికుడు-: అమిత్ షా
జనరల్

రామోజీరావు దేశ సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనికుడు-: అమిత్ షా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!