

అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ మరోసారి తెలుగు సినిమా సన్నివేశాన్ని తన సందేశం కోసం ఉపయోగించింది. గతంలో జింబాబ్వేలోని ఇరాన్ రాయబార కార్యాలయం నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాన్ని పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి: ది బిగినింగ్’లోని యుద్ధ సన్నివేశాన్ని పంచుకుంది. ఇందులో బాహుబలి కాలకేయుల సైన్యంతో పోరాడే దృశ్యాలు ఉన్నాయి.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ కాన్సులేట్ ఈ వీడియోను ఉపయోగించింది. ‘‘మేం ఎవరికీ తలవంచబోం’’ అనే సందేశాన్ని బాహుబలి పోరాట సన్నివేశాలతో అనుసంధానించింది. అమెరికా ఒత్తిడికి తలొగ్గబోమని, దేశం కోసం త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని పెజెష్కియాన్ పేర్కొన్నట్లు కాన్సులేట్ తన పోస్టులో తెలిపింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!