
సినిమాలు

హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని సక్సెస్ ది స్కూల్ వివాదంపై బీజేపీ నేత మాధవీలత స్పందించారు. రెండో తరగతి చదువుతున్న హిందూ విద్యార్థికి ఇస్లామిక్ వచనాలను హోంవర్క్‌గా ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ఓ ఉపాధ్యాయురాలిని తొలగించిన ఘటనపై ఈ వివాదం చెలరేగింది. ఈ అంశాన్ని రాజకీయంగా మార్చడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని మాధవీలత అన్నారు.
తొలగించిన ఉపాధ్యాయురాలిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పాఠశాల యాజమాన్యాన్ని ఆమె కోరారు. ఒక మత విశ్వాసాన్ని మరో మతానికి చెందిన విద్యార్థులపై బలవంతంగా రుద్దకూడదని స్పష్టం చేసిన ఆమె, పాఠశాలలు విద్య, విజ్ఞానం, సాంకేతికతకు కేంద్రాలుగా ఉండాలని పేర్కొన్నారు. “మతం అనేది వ్యక్తిగత ఎంపిక.. ఎవరిపైనా బలవంతంగా రుద్దలేం” అనే ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!