
షోస్

పోలవరం సాగునీటి ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల బృందం ఎనిమిదోసారి సందర్శిస్తోంది. ఇప్పటికే ఏడు విడతల్లో ప్రాజెక్టును పరిశీలించిన విదేశీ నిపుణులు, నేటి నుంచి నాలుగు రోజుల పాటు పర్యటన కొనసాగించనున్నారు. ఈ పర్యటనలో విదేశీ నిపుణులతో పాటు కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ), సీఎస్ఎంఆర్ఎస్, వ్యాప్కోస్ సంస్థలకు చెందిన అధికారులు పాల్గొంటున్నారు.
క్షేత్రస్థాయి పరిశీలనకు ముందు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈవో సంజీవ్ వోహ్రా అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టులో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్సీ కె. నరసింహమూర్తి, ఎస్ఈ పి. రామచంద్రరావు, నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ ఎ. గంగాధర్ వివరించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!