
రాజకీయాలు

దిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పెను ప్రమాదం తప్పింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి చెందిన పవర్‌బ్యాంక్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనతో విమాన ప్రయాణాల్లో ఎలక్ట్రానిక్ పరికరాల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!