
సినిమాలు

అంతర్జాతీయ వేదికపై భారత విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను నిరూపించారు. కొలంబియాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో భారత్ ఐదు స్వర్ణ పతకాలు సాధించి సంయుక్తంగా ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. జులై 4 నుంచి 12 వరకు జరిగిన ఈ పోటీల్లో 87 దేశాల నుంచి 381 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
పుణె, ఇండోర్, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. ఈ జట్టుకు టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ పరిధిలోని హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ శిక్షణ అందించింది. ఈ విజయం భారత విద్యార్థుల శాస్త్రీయ ప్రతిభను ప్రపంచానికి తెలియజేసిందని అధికారులు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!