
జనరల్

దేశ సరిహద్దుల్లో భద్రత కల్పించడమే కాకుండా అవసరంలో ప్రజలకు అండగా నిలవడంలోనూ భారత సైనికులు ఎప్పుడూ ముందుంటారనే విషయాన్ని మరోసారి నిరూపించిన ఘటన ఛత్తీస్గఢ్లో చోటుచేసుకుంది. ఆపదలో చిక్కుకున్న ఓ మహిళకు భారత జవాన్ చేసిన సహాయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.
వ్లాగర్ దీపిక ప్రయాణిస్తున్న ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ పూర్తిగా అయిపోవడంతో రోడ్డుమధ్యలో నిలిచిపోయింది. ఈ విషయం గమనించిన భారత సైనికుడు నరేంద్ర, మండుటెండను సైతం లెక్కచేయకుండా కారును సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్ వరకు స్వయంగా తోసుకెళ్లి సహాయం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారగా, "ఇదే నిజమైన సేవాభావం" అంటూ నెటిజన్లు జవాన్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!