

భారత్–ఐరోపా భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వం, సుస్థిర అభివృద్ధి, ఉమ్మడి శ్రేయస్సుకు బలమైన స్తంభంగా మారాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌లో వోల్వో సంస్థ నిర్వహించిన యూరోపియన్ సీఈవోల రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ అనిశ్చితి, సరఫరా వ్యవస్థల ఒత్తిడి, ఇంధన భద్రత, వాతావరణ మార్పుల వంటి సవాళ్ల మధ్య భారత్–ఐరోపా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
భారత్–యూరప్ సంబంధాలు కీలక మలుపు తిరుగుతున్నాయని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. దాన్ని త్వరగా అమలు చేయాలని ఇరుపక్షాలకు పిలుపునిచ్చారు. యువ జనాభా, విస్తరిస్తున్న మధ్యతరగతి, మౌలిక సదుపాయాల అభివృద్ధి భారత్ ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. తదుపరి టెక్నాలజీ విప్లవాన్ని భారత్‌లోనే కలిసి సృష్టించాలని యూరోపియన్ కంపెనీలను కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!