
జనరల్

ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా నమోదయ్యాయి. ఈరోజు మరో 90 పైసల పెంపుతో ఇంధన ధరలు మరింత భారంగా మారాయి. దీంతో రాష్ట్రంలోని వాహనదారులు తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొంటున్నారు.
విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.114.48కి చేరుకోగా, డీజిల్ రూ.102.17గా నమోదైంది. ఇక ఢిల్లీలో పెట్రోల్ రూ.98.63, డీజిల్ రూ.91.50గా ఉండగా, హైదరాబాద్లో పెట్రోల్ రూ.111.36, డీజిల్ రూ.99.53గా ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ధరలు గణనీయంగా అధికంగా ఉండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!