
జనరల్

నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దు ప్రాంతాన్ని తాకాయి. వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావం కూడా వర్షాలకు కారణమవుతోంది.
మంగళవారం ఖమ్మం, నల్గొండ, వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్, హనుమకొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి. ఈ నెల 14 వరకు తేలికపాటి వర్షాలు కొనసాగుతాయని, పసుపు హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!