
క్రీడలు

హైదరాబాద్ హయత్‌నగర్‌లో పాల కేంద్రాలపై టీజీ సేఫ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమతి పత్రం లేకుండా పాల కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆ కేంద్రాన్ని అధికారులు మూసివేశారు.
మరో పాల కేంద్రంలో అపరిశుభ్రమైన వాతావరణం ఉన్నట్లు తనిఖీల్లో గుర్తించారు. దీంతో నిబంధనలు పాటించని ఆ పాల కేంద్రం అనుమతి పత్రాన్ని టీజీ సేఫ్ అధికారులు రద్దు చేశారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన పాల ఉత్పత్తులు అందేలా తనిఖీలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!