

హైదరాబాద్‌ను అంతర్జాతీయ వైద్య పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ ఆస్పత్రులకు సమానంగా ప్రభుత్వ దవాఖానల్లో కూడా విదేశీయులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ చర్యల ద్వారా హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి వైద్య సేవల గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రభుత్వ దవాఖానల్లో వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలను అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి. గౌతమి, నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప సభ్యులుగా ఉన్నారు. కమిటీ నెల రోజుల్లోగా ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!