
జనరల్

చెన్నైలో రాజకీయ పరిణామాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు తొలగినట్లు సమాచారం. వీసీకే పార్టీ టీవీకేకు బేషరతుగా మద్దతు ప్రకటించింది. మద్దతు లేఖను కూడా అధికారికంగా టీవీకేకు అందజేశారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉన్న సస్పెన్స్ తగ్గినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ వీసీకే కార్యాలయానికి బయల్దేరారు. మద్దతు ఇచ్చిన వీసీకేకు ఆయన కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉంది. ఈ భేటీతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!