
సినిమాలు

హైదరాబాద్‌లోని టీహబ్‌లో హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించారు. నియోపోలీస్, గోల్డెన్‌మైల్, సరూర్‌నగర్ ప్రాంతాల్లోని ప్రీమియం భూముల ఈ-వేలంపై సమావేశంలో చర్చించారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లు, సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులు సమావేశానికి హాజరై వేలం ప్రక్రియ, భూముల వివరాలు, నిబంధనలపై అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్నారు.
సెప్టెంబర్ 7న 4,356 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన సరూర్‌నగర్ లేఅవుట్‌కు ఈ-వేలం నిర్వహించనున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. అలాగే సెప్టెంబర్ 9న 4.59 ఎకరాల నియోపోలీస్ లేఅవుట్, 0.70 ఎకరాల గోల్డెన్‌మైల్ లేఅవుట్‌లకు ఈ-వేలం జరగనుంది. ప్రీమియం ప్రాంతాల్లోని భూముల వేలానికి డెవలపర్లు, పెట్టుబడిదారుల నుంచి ఆసక్తి వ్యక్తమైనట్లు తెలుస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!