

గాయం నుంచి కోలుకున్న తర్వాత రష్మిక మందన్న ‘రాకా’ చిత్రీకరణను ముంబైలో తిరిగి ప్రారంభించినట్లు సమాచారం. తొలుత ఆగస్టులోనే ఆమె సెట్స్‌లోకి రావాల్సి ఉన్నప్పటికీ, హిప్ గాయం కారణంగా షూటింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి రష్మిక చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన పూర్తి స్థాయి సన్నివేశాల చిత్రీకరణ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుందని సమాచారం. దీంతో ‘రాకా’ షూటింగ్ మళ్లీ వేగం పుంజుకున్నట్లు తెలుస్తోంది. భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అల్లు అర్జున్, రష్మిక మందన్న కలిసి పలు కీలక యాక్షన్ సన్నివేశాల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే యాక్షన్ ఎపిసోడ్లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. రష్మిక తిరిగి సెట్స్‌లోకి రావడంతో తదుపరి షెడ్యూల్స్‌ను పూర్తి చేసే పనిలో చిత్ర బృందం నిమగ్నమైందని సమాచారం. ప్రస్తుతం ముంబైలో కీలక సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతోంది. రష్మిక రీఎంట్రీతో సినిమా షూటింగ్ మరింత వేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!