

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో దాదాపు 24 గంటలుగా వర్షం కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాల కారణంగా రహదారి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
జమ్మూ కశ్మీర్‌లోని భదర్వాలో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆకస్మిక వర్షాల కారణంగా శ్రీనగర్-లేహ్ హైవేపై కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. భారీ నుంచి అతిభారీ వర్షాల సమయంలో పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో కొండచరియలు, రాళ్లు విరిగిపడటం, రహదారులకు అంతరాయం వంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!