
సినిమాలు

మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో గురువారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అనేక ప్రాంతాల్లో పిడుగుల ప్రమాదం ఉన్న వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
మార్కాపురం, రాయలసీమ జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో గాలివాన బీభత్సం సృష్టించి విద్యుత్ స్తంభాలు పడిపోవడం, చెట్లు కూలిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!