

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) యువతకు ప్రతిష్టాత్మకమైన ఇంటర్న్షిప్ అవకాశాన్ని అందిస్తోంది. సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు, గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అంతరిక్ష పరిశోధన, సాంకేతిక ప్రాజెక్టుల్లో ప్రత్యక్ష అనుభవం పొందేందుకు ఈ ఇంటర్న్షిప్ ఉపయోగపడనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు లేదా 10కి 6.32 సీజీపీఏ కలిగి ఉండాలి. భారతీయ పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఇస్రోకు చెందిన వివిధ కేంద్రాలు, విభాగాల్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం అభ్యర్థులకు లభిస్తుంది. ఇంటర్న్షిప్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఇస్రో తరఫున ధ్రువపత్రం అందజేస్తారు. అయితే ఈ సమయంలో ఎలాంటి స్టైపెండ్ లేదా పారితోషికం ఇవ్వరు. వసతి, భోజనం వంటి ఖర్చులను అభ్యర్థులే భరించుకోవాలి. అంతరిక్ష రంగంలో కెరీర్ నిర్మించుకోవాలనుకునే యువతకు ఈ అవకాశం ఎంతో ఉపయోగకరంగా మారనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!