
గాసిప్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఉదయం 11:15 గంటలకు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఇటీవల సినిమా షూటింగ్‌లో గాయపడిన నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ను చంద్రబాబు పరామర్శించనున్నారు. బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి, కోలుకుంటున్న తీరుపై వైద్యులను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో తనకు నిర్దేశించిన కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అనంతరం సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరనున్నారు. రాత్రి 8:40 గంటల సమయంలో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నట్లు సమాచారం. సినిమా షూటింగ్‌లో బాలకృష్ణ గాయపడిన నేపథ్యంలో చంద్రబాబు ఆయనను ఆస్పత్రిలో పరామర్శించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!