
జనరల్

తెలంగాణ ప్రజలకు చల్లని వార్త అందింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రుతుపవనాలు పూర్తిగా విస్తరించగా, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్రలో సుమారు 30 శాతం విస్తరించినట్లు పేర్కొన్నారు.
అలాగే బంగాళాఖాతంలో రుతుపవనాలు పూర్తిగా వ్యాపించినట్లు వాతావరణ శాఖ వివరించింది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!