
జనరల్

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నాగర్‌కర్నూలు, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది.
ఇక హైదరాబాద్, ఆదిలాబాద్, హనుమకొండ, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, కొమురంభీం, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!