

ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేశ్ మృతి చెందడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గల్లంతైన సమాచారం అందినప్పటికీ, సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకుని ఉంటారనే ఆశతో ఎదురు చూసినట్లు ఆయన భార్య భార్గవి తెలిపారు. సముద్ర ప్రయాణాల్లో అనుభవం ఉన్న సురేశ్ తప్పకుండా తిరిగి వస్తారని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పానని, అయితే కొద్ది గంటల్లోనే ఆయన మరణ వార్త వినాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖపట్నంలోని శ్రీహరిపురం శ్రీనివాస్‌నగర్‌కు చెందిన సురేశ్‌కు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన ఓ వాణిజ్య నౌకలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. జూన్ 9న రాత్రి కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన సురేశ్, తన ఒప్పందాన్ని ముగించుకుని త్వరలో స్వదేశానికి వస్తానని చెప్పినట్లు భార్గవి గుర్తు చేసుకున్నారు. భర్త మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకురావాలని, పిల్లల విద్య కోసం ప్రభుత్వ సహాయం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు కుటుంబాన్ని పరామర్శించి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!