

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై జేవర్ ప్రాంతం సమీపంలో మహోబా వైపు వెళ్తున్న స్లీపర్ టూరిస్ట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు గాయపడగా, కనీసం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సు నుంచి దూకినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అత్యవసర బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆందోళన వ్యక్తం చేసి, గాయపడిన వారికి తక్షణ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!