
రాజకీయాలు

హైదరాబాద్‌లోని కొల్లూరులో సుమారు రూ.90 కోట్ల విలువైన భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మూడు ఎకరాల భూమిని అక్రమంగా మ్యుటేషన్ చేసినట్లు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) దర్యాప్తులో గుర్తించింది. ధరణి వ్యవస్థలో చోటుచేసుకున్న భూ రికార్డుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ కేసులో భూభారతి ఆపరేటర్‌తో పాటు శివ, రాజేందర్, పవన్, మహేష్ అనే నలుగురిని సీఐడీ అరెస్ట్ చేసింది. భూభారతి చట్టం-2025 నిబంధనలను ఉల్లంఘిస్తూ భూ రికార్డులను ట్యాంపరింగ్ చేసినట్లు నిందితులపై ఆరోపణలు ఉన్నాయి. అరెస్టు చేసిన నలుగురికి న్యాయస్థానం రిమాండ్ విధించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!