
రాజకీయాలు

ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో ₹3,184 కోట్ల వ్యయంతో గంగా కారిడార్ ప్రాజెక్టు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 20 కిలోమీటర్ల అనుసంధాన మార్గాన్ని నిర్మించి జాతీయ రహదారి-19, వలయ మార్గం, గంగా నదీ తీర ప్రాంతాలను కలపనున్నారు. దీనివల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
గత పదేళ్లలో కాశీ విశ్వనాథ కారిడార్, వలయ మార్గాలు, జాతీయ రహదారి విస్తరణలు, నదీ తీర అభివృద్ధి వంటి పలు ప్రాజెక్టులతో వారణాసి వేగంగా అభివృద్ధి చెందింది. కొత్త గంగా కారిడార్ ద్వారా నగర రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు యాత్రికులు, స్థానికులు, వ్యాపార వర్గాలు, పర్యాటకులకు మెరుగైన అనుసంధానం లభించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!