

దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ పునఃపరీక్షకు ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో జాతీయ పరీక్షల సంస్థ అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు కీలక సూచనలు చేసింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న తప్పుడు సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
గత కొన్ని రోజులుగా నీట్ పునఃపరీక్ష వాయిదా పడబోతోందంటూ కొన్ని నకిలీ ప్రకటనలు, తప్పుడు ప్రచారాలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన జాతీయ పరీక్షల సంస్థ, పరీక్ష వాయిదా పడుతుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. విద్యార్థులు వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని సూచించింది.
పరీక్షకు సంబంధించిన నియమాలు, షెడ్యూల్ లేదా ఇతర మార్పులపై సమాచారం ఉంటే అది కేవలం అధికారిక వేదికల ద్వారానే వెల్లడిస్తామని సంస్థ తెలిపింది. అనధికారిక ఖాతాల్లో వచ్చే సమాచారాన్ని నమ్మకుండా, అధికారిక ప్రకటనలనే విశ్వసించాలని అభ్యర్థులకు మరోసారి సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!