
రాజకీయాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఆదర్శనగర్‌లో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శుక్రవారం నాటికి ఉత్సవాలు ఐదవ రోజుకు చేరుకోగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గణపతి మండపం వద్ద సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఆదర్శనగర్‌తో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన మహిళా భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజల్లో పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వాహకులు ప్రతిరోజూ వివిధ ఆధ్యాత్మిక, భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో గణపతి మండపం పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!