

ద్విచక్రవాహన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన కేసులో తన కుమారుడిని కాపాడేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలతో వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో యువకుడిపై నేరం మోపే ప్రయత్నం జరిగినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు పేర్కొంటూ అప్పలరాజును ఏ3గా చేర్చారు. అరెస్టు సమయంలో ఆయన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
భారీ పోలీసు బందోబస్తు మధ్య అప్పలరాజును కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అరెస్టుకు ముందు స్పందించిన అప్పలరాజు, కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపిస్తూ, తాను పోలీసు చర్యలకు భయపడనని వ్యాఖ్యానించారు. ఇదే కేసులో ఆయన కుమారుడు ఆరవ్ వర్మ దాఖలు చేసిన రెగ్యులర్, తాత్కాలిక బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించగా, అప్పలరాజు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను వాయిదా వేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!